- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్ ఒక్కటే : బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీమంత్రి కేటీఆర్(KTR) ఒక్కటేనా? అనే అనుమానం వస్తోందని..ఎందుకంటే సీఎంను పట్టుకుని లొట్టపీసు సీఎం, చిట్టినాయుడు, సన్నాసిగాడు అని తిడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ప్రశ్నించారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తిడుతున్నా సీఎం పట్టించుకోకుండా విచారణ పేరుతో అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటే తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని సంజయ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు అనుమానం వస్తుందన్నారు. కేటీఆర్ ఏమైనా దేశం కోసం కొట్లాడిన స్వాతంత్ర్య సమర యోధుడా? ప్రజా సమస్యలపై పోరాడినోడా? కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డోడని..ఆయన జైలుకు వెళితే బీఆర్ఎస్ నాయకులు గొడవలు చేయడం ఎందుకని బండి సంజయ్ విమర్శించారు. కేబినెట్ అనుమతి లేకుండా సర్కార్ సొమ్మును అప్పనంగా విడుదల చేయాల్సిన అవసరమేముందని.. పైగా కేబినెట్ ఆమోదం లేకుండా కోట్లు నిధులు విడుదల చేయడానికి కేటీఆర్ కు అంత ఆత్రం ఎందుకు? అని.. ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎట్లా రిలీజ్ చేస్తాడని నిలదీశారు.
కేటీఆర్ కు దమ్ముంటే 700 కోట్ల లాభం ఎట్లా వచ్చిందో లెక్క చెప్పాలని..ఆ లాభం వచ్చిన సొమ్ము యాడ ఉందో ప్రజల ముందుంచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్ రాక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతుంటే ఈఫార్ములాపై చూపిన ఆత్రం విద్యార్థులపై ఎందుకు చూపలేదని? ఆరోగ్యశ్రీ నిధుల విడుదలపై ఎందుకు చూపడం లేదని కేటీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు.
కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమేనని.. ఎందుకంటే బామ్మర్థి ఫాంహౌజ్ కేసులో డ్రగ్స్ తో దొరికినా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారని గుర్తు చేవారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, ధరణి భూముల వ్యవహారంపైనా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారన్నారు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చినోడేనని... కాంగ్రెస్ కథలన్నీ తెలుసని.. ఏదైనా స్కాం తెరమీదకు రాగానే ఢిల్లీకి పోయి కేసీఆర్ కప్పం కట్టి వస్తున్నాడని... ఆ కేసులన్నీ లొట్టపీసు వ్యవహారంగా మారుతోందని బండి సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని... ఈ రెండు పార్టీల రాజకీయ డ్రామాలను ఎండగడతామని..ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అవినీతిని, కేసీఆర్ కుటుంబ బండారాన్ని పూర్తిగా ప్రజల ముందుంచి తీరుతామని.. ఈ విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.