- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చర్చనీయాంశంగా ‘దిశ’ కథనాలు.. మిస్టర్ పర్సంటేజ్ ఎవరని ఆరా
దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ వినని పేరు అది. ఇప్పటివరకు ఎవరికి దక్కని పేరు కూడా.. ఆ పేరే మిస్టర్ పర్సంటేజ్... కేవలం 8 నెలల్లోనే ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న ఆ మహానుభావుడు ఎవరు..? ఆ గొప్ప వ్యక్తి గురించి ఆరా తీస్తున్న మున్సిపల్ ప్రజలు.. ఆ పేరే ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మిస్టర్ పర్సంటేజ్ పేరుకు కామారెడ్డి మున్సిపాలిటీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిందంటే నమ్ముతారా.. నిజమేనండి. మీరు నమ్మాల్సిందే..!
ఆరా తీస్తున్న పట్టణ ప్రజలు
కామారెడ్డి మున్సిపాలిటీలో పర్సంటేజ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంత గొప్ప పేరు క్రియేట్ చేసిన "దిశ" పత్రికపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులకు రకరకాల పేర్లు వస్తుంటాయి. కానీ ఈ తరహా పేరు రాజకీయాల్లో ఎప్పుడు వినపడలేదని చర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని పట్టణ ప్రజలు తహతహలాడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారో అని ఇప్పటికే ఆరా తీయడం మొదలెట్టేశారు. ఏ క్షణాన్నైనా వ్యక్తిని కనిపెట్టేలా ఉన్నారని జోరుగా చర్చ సాగుతోంది.
జనాల్లోకి మిస్టర్ పర్సంటేజ్..
మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులున్నాయి. ఈ పరిధిలో ఉన్న కౌన్సిలర్లకు మాత్రమే ఈ మిస్టర్ పర్సెంటేజ్ గురించి తెలుసు. వారికి మాత్రమే తెలిసిన ఆ పేరు ఇప్పుడు జనాల్లోకి చొచ్చుకుపోయింది. దాంతో ఏమిటో ఈ వింత అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మున్సిపాలిటీకి వచ్చే ప్రతి ఒక్కరు ఎవరా మిస్టర్ పర్సంటేజ్ అని ఆరా తీస్తున్నారు. దాంతో ఏం చెప్పాలో తెలియక మున్సిపల్ సిబ్బంది తప్పించుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
చర్చనీయాంశంగా "దిశ" కథనాలు
కామారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై "దిశ"లో వస్తున్న వరుస కథనాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిర్భయంగా రాస్తున్న "దిశ"కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మరోవైపు వరుస కథనాలు రాకుండా ఎలా ఆపాలో తెలియక నాయకులు తికమకపడుతున్నారు. ఎలాగైనా ఈ వార్తలు రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలా మున్సిపాలిటీపై ఆరోపణలతో కూడిన వార్తలు వస్తున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండటమే ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అధికారులకు మిస్టర్ పర్సంటేజ్ కు మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు ఏ మేరకు ఉన్నాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.