‘తిరుపతి’ బాధితులకు డబ్బు ఇచ్చి ప్రభుత్వం పై విమర్శలా?.. మంత్రి ఆగ్రహం

by Jakkula Mamatha |
‘తిరుపతి’ బాధితులకు డబ్బు ఇచ్చి ప్రభుత్వం పై విమర్శలా?.. మంత్రి ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వం గురించి చెడుగా చెప్పాలని తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైసీపీ నేతలు(YCP Leaders) డబ్బు కవర్లు ఇచ్చారని మంత్రి ఆనం రామనారయణ(Minister Rama Narayana Reddy) రెడ్డి ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) నెల్లూరు(Nellore)లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. పలువురు గాయపడ్డారని తెలిపారు. ఈ క్రమంలో క్షతగాత్రులను సీఎం చంద్రబాబు గంటన్నరపాటు పరామర్శించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కూటమి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే ఈ ఘటనను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఆ నాయకులకు సిగ్గు అనిపించట్లేదా? అని మండిపడ్డారు. పేషెంట్లు బాధల్లో ఉంటే పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై అసత్య ఆరోపణలు చేయండని చెబుతారా? అని ప్రశ్నించారు. జగన్(YS Jagan) దుష్ట చతుష్టయమే తిరుమల(Tirumala) పవిత్రతను మంటగలిపే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శలు గుప్పించారు. తొక్కిసలాటపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారని అన్నారు. స్పృహ కోల్పోయిన మహిళను బయటకు తీసుకెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది చెప్పారు. టోకెన్లు ఇస్తున్నారన్న ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడ్డారు. ఒకవైపు తెరవాల్సిన గేట్లు.. మరో వైపు తెరవడంతో తొక్కిసలాట జరిగినట్లు చాలామంది తెలిపారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు.

Advertisement

Next Story