- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంచివాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు..
దిశ, సినిమా: ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న సాయిరాం శంకర్(Sairam Shankar) నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’(Oka Pathakam Prakaaram) . ఇందులో శ్రుతి సోధి(Shruti Sodhi), ఆశిమ నర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్(Vihari Cinema House Private Limited) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘‘ఓ మంచివాడి లోపల ఒక చెడ్డ వాడు ఉంటాడు, ఓ చెడ్డవాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు’’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలవుతూ క్రైం, మర్డర్ కథనాలను చూపిస్తూ హీరోనే విలనా అనే సందేహంపై ముగించడం ఆసక్తికరంగా ఉంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్(Vinod Kumar Vijayan) మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన కథ. అడ్వకేట్ పాత్రలో సాయిరాం శంకర్, పోలీసు పాత్రలో సముద్రఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో ఉత్కఠభరితంగా తీసుకెళ్ళే క్రైం, మిస్టరీ కథనాలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. రాహుల్ రాజ్(Rahul Raj), గోపి సుందర్ పాటలు - స్కోర్ అద్భుతంగా వచ్చాయి. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం’’ అన్నారు.