- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సీఎం రేవంత్ ఒక్క సైగ చేస్తే చాలు’.. కేటీఆర్‌కు సంపత్ కుమార్ హెచ్చరిక
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) మాటలు రాజకీయాలకే తలవంపుగా ఉన్నాయని ఏఐసీసీ(AICC) సెక్రటరీ సంపత్ కుమార్(Sampath Kumar) మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా అని దేశం మాట్లాడుకుంటుందని ఆవేదన చెందారు. ‘కేటీఆర్(KTR) తరచూ లుచ్చా లుచ్చా’ అని మాట్లాడటం సమంజసం కాదని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్, డ్రగ్ కేసు, జన్వాడ ఫాంహౌస్, ఫోన్ ట్యాపింగ్, ధరణి, ORR అమ్ముకోవడం ఇవన్నీ లుచ్చా పనులు కావా? అని ప్రశ్నించారు. తాము మంచి మనసుతో విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడం, రైతురుణమాఫీ చేయడం లుచ్చా పనా? అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, తమ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తా అని కేటీఆర్‌కు సంపత్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. సీబీఐ విచారణకు వెళ్లొచ్చిన కేటీఆర్‌కు మంగళ హారతులు ఇస్తున్నారు. ఆయనేమన్న దేశానికి సేవ చేశాడా? దేవుడికి సేవ చేశాడా? అని ప్రశ్నించారు. అధికార రాజసం లేదని.. అవినీతి సంపాదన దూరం అయ్యిందనే నైరాశ్యంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం ఒక్క సైగ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి మాసిపోతావ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి పరిధి దాటి మాట్లాడకు.. కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకొనివ్వకు అని కేటీఆర్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. బండి సంజయ్ ఓ మెంటల్ కృష్ణ ఎద్దేవా చేశారు. ఆయన కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.