తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

by Aamani |
తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
X

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని...నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు సవాల్ విసిరారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొంగిడి సునీత మతి స్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నార‌ని, బీర్ల అయిలయ్య బదులు నీళ్ల అయిలయ్య అని ఆలేరు ప్రజలు తన పేరు మార్చినట్టు చెప్పారు.

కొలనుపాక ల్యాండ్ ఇష్యూతో తనకు సంబంధం లేదని, తన బినామీలు ఎవరో నిరూపించాలని డిమాండ్ చేశారు. 150 డాక్యుమెంట్లలో తన అనుచరుల పేర్లు ఒక్కటి ఉన్నా తాను రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటవా‌ అని సునీతకు సవాల్ విసిరారు. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే తాను ప్రశ్నించానని, బీసీ ఎమ్మెల్యేను కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనకు వస్తున్న ప్రజాధరణ చూసి గొంగిడి సునీత ఓర్వడం లేదని, దమ్ముంటే పది రోజుల్లో నిరూపించాలని, వెంటనే తన సవాల్ ను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాను అభివృద్ధే తప్ప ఎక్కడ కూడ అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed