- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుపతి ఘటనతో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తం

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati incident)తో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. గురువారం అధికారులకు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మరణించడం చాలా బాధాకరం. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. గాయాలపాలై వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతన్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అంతేకాదు.. సంక్రాంతి పండుగ(Sankranti Festival) సెలవుల్లో దేవాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారని.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మరణించడం చాలా బాధాకరం.
— Konda Surekha (@iamkondasurekha) January 9, 2025
ఈ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తుల కుటుoబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న.
గాయాలపాలై వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతన్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న.…