ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర.. కట్ చేస్తే. మొదటి మ్యాచులోనే దారుణమైన ట్రోల్స్

by Mahesh |
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర.. కట్ చేస్తే. మొదటి మ్యాచులోనే దారుణమైన ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రపంచంలో మంచి ఎంత మంచి ఫామ్ కొనసాగించినప్పటికి.. ఒక్క మ్యాచుల్లో పేలవమైన దారుణంగా ట్రోల్స్ (Trolls) చేస్తారు. ముఖ్యంగా ఐపీఎల్ (IPL) వచ్చిందంటే చాలు ఈ ట్రోలింగ్స్ మరింత పెరుగుతాయి.ఎవరైన ఆటగాల్లు అసాధారణమైన ఆటను కనబరిస్తే.. ఆకాశానికి ఎత్తేస్తారు. మరుసటి రోజు ఆశించిన స్థాయిలో ఆడకపోతే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తారు. తాజాగా అలాంటి ట్రోల్స్ ను రిషబ్ పంత్ ఎదుర్కొంటున్నాడు. భారత క్రికెట్ జట్టులో కీలకమైన ప్లేయర్ గా ఉన్న పంత్ ను ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ జట్టు (Delhi Team) వదులుకోగా.. లక్నో జట్టు (Lucknow team) 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే (History of IPL) రిషబ్ పంత్ (Rishabh Pant) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా నిలిచాడు. భారీ ధరకు అమ్ముడుపోయిన పంత్ పై లక్నో జట్టుతో పాటు అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఢిల్లీతో జరిగిన మ్యాచులో అతని ఫామ్ (Form)తో పాటు కెప్టెన్సీ ఫెయిల్ కావడంతో పంత్ తో పాటు లక్నో జట్టును టార్గెట్ గా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. గత సీజన్లో ఓ మ్యాచ్ ఓటమి తర్వాత కేఎల్ రాహుల్ పై ఆ జట్టు యజమాని గ్రౌండ్ లోనే తిట్టడం తెలిసిందే. తాజా ఆ సంఘటనను గుర్తు చేస్తూ.. రాహుల్ ను కాదని.. 27 కోట్లకు పంత్ ను కొన్నారు.. ఏమీ లాభం మీ ప్రవర్తన మాత్రం మారలేదని పోస్టులు చేస్తున్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన పంత్.. మొదటి మ్యాచ్లో 0 పరుగులకు అవుట్ కావడంతో.. చివరి ఓవర్లో మ్యాచ్ విన్నింగ్ స్టంప్ (Match winning stump) ను మిస్ చేసినందుకు అతనిపై ట్రోల్స్ చేస్తున్నారు. రూ. 27 కోట్లకు అమ్ముడు పోయిన పంత్.. ఇప్పటికి ఢిల్లీకి ఫేవర్ గా మ్యాచ్ ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed