సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రముఖ హీరోయిన్ ప్రైవేట్ వీడియో.. చివరకు ట్విస్ట్ అదిరిందిగా!

by Hamsa |
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రముఖ హీరోయిన్ ప్రైవేట్ వీడియో.. చివరకు ట్విస్ట్ అదిరిందిగా!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా టెక్నాలజీ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎఐ ద్వారా పలువురు సినీ స్టార్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా ఎఐ వల్ల ఎన్నో బోల్డ్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎంతో మంది హీరోయిన్స్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ కావడంతో కొంతమంది జాగ్రత్త పడ్డారు. తాజాగా, మరో స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. కోలీవుడ్ బ్యూటీ శృతి నారాయణన్(Shruti Narayanan) ప్రైవేట్ వీడియోపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఓ ప్రైవేట్ ఆడిషన్ ఇస్తున్న టైమ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది. దాన్ని ఎవరో వీడియో తీసి నెట్టింట పెట్టడంతో కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. దాదాపు ఈ వీడియో 14 నిమిషాల పాటు ఉన్నట్లు సమాచారం.

ఇక దీనిపై శృతి నారాయణన్ కూడా స్పందించకపోవడం గమనార్హం. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చుకుంది. మళ్లీ ఏమైందో తెలియదు కానీ పబ్లిక్‌గా చేంజ్ చేసింది. అయితే ఆ వీడియో ఆమెదేనా కాదా అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం శృతి నారాయణన్ పేరు మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అయితే ఆ లీకైన శృతి నారాయణన్ వీడియో ఆడిషన్స్ టైమ్‌లో తీసింది అని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు ఈ వీడియో ఒరిజినలా లేక ఫేకా? అనే విషయం ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఈ వీడియో డీప్ ఫేక్ అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం లీక్ అయిన క్లిప్‌లో ఉన్నది నిజంగా శృతి నారాయణన్ అని నమ్ముతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా టెక్నాలజీ రావడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

Next Story

Most Viewed