- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Trending: బనగానపల్లెలో అద్భుతం.. ఇంటి కింద బయటపడిన పురాతన శివాలయం

దిశ, వెబ్‌డెస్క్: పరదేశీయుల పాలనలో భూస్థాపితమైన హిందుత్వ చారిత్రక అనవాళ్లు నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH) రాష్ట్రంలోని నంద్యాల (Nandyal) జిల్లా బనగానపల్లె (Banaganapally)-పేరుసోముల (Perusomula) గ్రామంలో శుక్రవారం అద్భతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఎర్రమల (Erramala) అనే వ్యక్తి పాత ఇంటిని నేలమట్టం చేసిన కొత్త ఇంటి నిర్మాణానికి పునాదులు తీస్తున్నాడు.
ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ పెద్ద గుంట ఏర్పడింది. సొరంగంలా ఉన్న అందులో రాజుల కాలం నాటి ఓ పురాతన శివాలయం (Shiva Temple) బయటపడింది. ఆలయంలో బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం కూడా దర్శనమిచ్చింది. అయితే, విషయం కాస్త ఉన్న ఊరితో పాటు పక్క గ్రామాలకు కూడా పాకడంతో శివ లింగాన్ని దర్శించుకునేందుకు జనం క్యూ కట్టారు. తాము నిర్మించుకుంటున్న ఇంటి కింద శివాలయం ఉందని తెలియడంతో ఎర్రమల కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ఇంట్లోకి మారారు. అయితే, శివాలయంలో పాటు లింగాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.