Expensive Watches: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలు ఇవే.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

by D.Reddy |
Expensive Watches: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలు ఇవే.. ధర తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక చేతి గడియారలను వినియోగించే వారి సంఖ్య తగ్గిపోయింది. కానీ, లగ్జరీ వాచ్‌లకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గలేదు. ధనవంతులు, సెలబ్రెటీలు వారి స్టేటస్‌కు ప్రతీకగా వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌గా గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ (Graff Diamonds Hallucination) నిలిచింది. దీన్ని వివిధ రంగులు, కట్స్‌తో కూడిన 110 క్యారెట్ల వజ్రాలతో తయారు చేశారు. ప్లాటినం బ్రాస్‌లెట్‌పై వజ్రాలను సెట్ చేశారు. 2014లో లాంచ్ అయిన ఈ వాచ్ ధర భారత కరెన్సీలో రూ. 458 కోట్లు ఉంటుంది.

* గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్ (Graff Diamonds The Fascination) హై-ఎండ్ వాచ్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్‌లో 152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలతో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఇది 2015లో రిలీజ్ అయ్యింది. ది ఫాసినేషన్‌ జాబితాలో గ్రాఫ్ డైమండ్స్‌ ఒక అద్భుతమైన వాచ్‌గా నిలిచింది. ఇక ఈ వాచ్ ధర రూ.416 కోట్లు ఉంటుంది.

* పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చైమ్ రెఫ్ (Patek Philippe Grandmaster Chime Ref. 6300A-010) వాచ్ ముందు, వెనుక రెండు వైపులా డయల్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఈ వాచ్‌లో 20 కాంప్లికేషన్స్, వన్ మినిట్ రిపీటర్, అలాగే డేట్ రిపీటర్ ఉన్నాయి. దీనిని పటేక్ ఫిలిప్ 175వ వార్షికోత్సవానికి గుర్తుగా 2019లో లాంఛ్ చేశారు. ఈ కంపెనీ విక్రయించిన అత్యంత ఖరీదైన వాచ్ ఇదే. దీని విలువ రూ. 249 కోట్లుగా ఉంది.

* బ్రెగ్వెట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోనిట్టే (Breguet Grande Complication Marie Antoinette) వాచ్ ధర రూ. 249 కోట్లు ఉంటుంది. ఇది పురాతన గడియారం. దీన్ని తయారుచేసేందుకు దాదాపు 40 ఏళ్లు పట్టింది. ఈ వాచ్‌ను ఫ్రెంచ్ రాణి ప్రేమికులలో ఒకరైన మేరీ ఆంటోనిట్టే ఆమెకు గిఫ్ట్‌గా అందించింది. ఇది ప్రేమకు చిహ్నంగా, అత్యంత విలువైన గడియారాలలో ఒకటిగా నిలిచింది. దీన్ని 1827లో తయారుచేశారు. ఇది 1900లో చోరీ అయ్యింది. ఇప్పుడు ఇది మ్యూజియంలో భద్రంగా ఉంది.

* జేగర్-లీకౌల్ట్రే జోయిలెరీ 101 మాంచెట్ (Jaeger-LeCoultre Joaillerie 101 Manchette) వాచ్ తెల్ల బంగారంతో తయారైంది. టూర్‌బిల్లాన్ సంక్లిష్టతను కలిగి ఉంది. ఇది బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ కోసం ప్రత్యేకంగా 2012లో రూపొందించారు. ఈ స్టేట్‌మెంట్ యాక్సెసరీ ఖరీదైన డిజైన్‌లో 577 వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ విలువ ఏకంగా రూ. 215 కోట్లు ఉంటుంది.



Next Story