- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Jaat OTT Release Date, Platform: ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) అందరికీ సుపరిచితమే. ఆయన హిందీలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక 2023లో చేసిన ‘గదర్-2’(Ghadar-2) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫామ్‌లోకి వచ్చేశాడు. అయితే తెలుగులోనూ ఆయన పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇటీవల సన్నీ డియోల్ హీరోగా చేసిన మొదటి తెలుగు మూవీ ‘జాట్’ (jaat). టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni)దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఇక రణ్‌దీప్ హుడా విలన్‌గా నటించిన ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ , జగపతి బాబు (Jagapathi Babu), రమ్య కృష్ణ , వినీత్ కుమార్ సింగ్ , ప్రశాంత్ బజాజ్ , జరీనా వాహబ్ , పి. రవి శంకర్, పృథ్వీరాజ్(Prithviraj) కీలక పాత్రలో కనిపించారు.
అయితే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్‌లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతున్న ‘జాట్’ బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ‘జాట్’ ఓటీటీపై పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మే 1న నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. లేదా జూన్ నెలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.