JNTU విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే..?

by Naveena |
JNTU విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే..?
X

దిశ, ఆందోల్: నాణ్యత భోజనం పెట్టడం లేదంటూ జేన్టీయూ క్యాంపస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి జేఎన్టీయూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. క్వాలిటీ భోజనం పెట్టడం లేదంటూ మెస్ కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత కొద్ది నెలలుగా క్యాంపస్ లో మెస్ కాంట్రాక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు క్యాంపస్ ప్రిన్సిపాల్ ను ఫిర్యాదు చేసి దృష్టికి తీసుకెళ్లిన.. తమ భోజనం సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ప్రిన్సిపాల్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదంటూ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కల్పించుకొవడంతో ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు క్యాంపస్ లో ఫుడ్ తనిఖీలు నిర్వహించి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడున్న సిబ్బంది తీరు మారకపోవడంతో.. నామమాత్రం తనిఖీలు చేసి వెళ్లిపోయారే తప్ప తమ సమస్య పరిష్కారం కాలేదంటూ మండిపడ్డారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో అ తిండి తినలేక పస్తులు ఉంటున్నామని, బయట హోటళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన భోజనం లేక తమ చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నామన్నారు.

-సీఐ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

నాణ్యత భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన విషయాన్ని తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ క్వాలిటీ గా పెట్టడం లేదని, ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లిన.. పట్టించుకోవడంలేదని వాపోయారు. అనంతరం క్యాంపస్ క్యాంటీన్ లోని భోజనాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని సీఐ హామీనిచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement
Next Story

Most Viewed