Fashion Week: మేము చేయగలం.. ఫ్యాషన్‌ షోలో రోబోల సందడి.. క్యాట్ వాక్, పల్టీలు సైతం

by Ramesh N |   ( Updated:2025-03-28 06:28:33.0  )
Fashion Week: మేము చేయగలం.. ఫ్యాషన్‌ షోలో రోబోల సందడి.. క్యాట్ వాక్, పల్టీలు సైతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Fashion Week) ష్యాషన్‌ షోలో మోడల్స్ క్యాట్ వాక్ చేయడం అందరికీ తెలిసిందే. అయితే, మేము కూడా చేయగలమని (Humanoid robots) రోబోలు ఓ ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రస్తుతం చాలా దేశాలు అధునాత రోబోలను రంగంలోకి దించుతున్నాయి. చైనా, జపాన్, అమెరికా లాంటి దేశాల్లో ప్రతి సెక్టార్‌లో రోబోలను వాడుతున్నారు. ఇప్పటి వరకు సెక్యూరిటీ, కంపెనీల అవసరాల కోసం ఎక్కువగా రోబోలను వాడుతున్నారు. అయితే తాజాగా ఫ్యాషన్‌, సాంకేతికతను జోడించి ఒక విప్లవాత్మకమైన కలయికను తీసుకొచ్చారు.

(Shanghai Fashion Week)చైనాలో షాంఘై ఫ్యాషన్‌ వీక్‌లో హ్యూమనాయిడ్ రోబోలు (Humanoid robots) తొలిసారిగా సందడి చేశాయి. బుధవారం జరిగిన ఈ ఫ్యాషన్ వీక్‌లో రోబోటిక్ కుక్కతో కూడిన హ్యూమనాయిడ్ రోబోట్ G1 అరంగేట్రం చేసింది. రకరకాల దుస్తులు ధరించిన మహిళలతో పాటు రోబోలు కలిసి ర్యాంప్ వాక్ చేశాయి. మోడల్స్ ప్రతిష్టాత్మకంగా చేసే ట్రెడిషనల్ క్యాట్ వాక్ రోబో చేయగా, రోబోటిక్ కుక్క పల్టీలు చేసి అందరినీ ఆకర్షించింది. ఓ మహిళా మోడల్ రోబోతో మాట్లాడి షేక్ హ్యాండ్ సైతం ఇచ్చింది. రోబో, రోబోట్ కుక్కకు సైతం ఫ్యాషన్ దుస్తులు వేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, చైనాకు చెందిన యునిట్రీ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన అధునాతన హ్యూమనాయిడ్ రోబోట్, ఏఐ AI-ఆధారంగా పనిచేస్తుంది. కదలికలు, పూర్తి శరీర చలన నియంత్రణను కలిగి ఉంది.

Read More..

Megastar chiranjeevi: చిరంజీవి లగ్జరీ క్రూయిజ్ షిప్ వీడియో వైరల్.. అసలు విషయం ఏమిటంటే?

Next Story

Most Viewed