‘కన్నప్ప’ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా అంటూ ఫైర్ అయిన ప్రముఖ నటుడు.. మంచు మనోజ్‌ను ఉద్ధేశించేనా..?

by Kavitha |   ( Updated:2025-03-25 11:45:37.0  )
‘కన్నప్ప’ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా అంటూ ఫైర్ అయిన ప్రముఖ నటుడు.. మంచు మనోజ్‌ను ఉద్ధేశించేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా కన్నప్ప మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఇక్కడ యాక్టర్ రఘుబాబు మాట్లాడుతూ.. ‘కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్ అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రఘుబాబు కామెంట్స్ విన్న నెటిజన్లు మంచు మనోజ్‌ను ఉద్ధేశించే ఈ వ్యాఖ్యలు చేశాడా అంటూ చర్చించుకుంటున్నారు.

Advertisement
Next Story

Most Viewed