Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by D.Reddy |
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల (Tirumala) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. వారాంతం, వరుస సెలవులు సమీపిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని మొత్తం 64,279 మంది భక్తులు దర్శించుకోగా.. 24,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు సమకూరింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story