- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు సైనికుల వీరమరణం, ముగ్గురు తీవ్రవాదులు హతం

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని కథువా జిల్లా (Kathua District)లో సుఫైన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. గత ఐదు రోజులుగా ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ (Anti-Terrorist Operation) కూడా కొనసాగుతోంది. ఈ మేరకు మరోసారి సుఫైన్ అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతాదళాలు సోదాలు చేపడుతుండగా వారికి ఉగ్రవాదులను ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందగా.. మరో ముగ్గురు పాకిస్థానీ అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక డీఎస్పీ ధీరజ్ కచోట్ (DSP Dheeraj Kachot)తో పాటు మరో ఏడుగురు సిబ్బందికి గాయాలైనట్లుగా ఆర్మీ ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు.
కాగా, మార్చి 23 సాయంత్రం కథువా జిల్లా (Kathua District)లోని హిరానగర్ సెక్టార్ (Hiranagar Sector)లో జరిగిన ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో తప్పించుకున్న ఆ గ్రూప్ ఉగ్రవాదులే ఇవాళ ఉదయం పోలీసులకు ఎదురుపడ్డారు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఉద్రవాదులు ఏకంగా బార్టర్ క్రాస్ చేసి దట్టమైన నర్సరీలో చొరబడగా.. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాలకు పైగా కాల్పులు జరిగినప్పటికీ అక్కడి నుంచి టెర్రరిస్ట్‌లు తప్పించుకోగలిగారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, 2024లో జమ్ము (Jammu) ప్రాంతంలో జరిగిన వరుస దాడులు, ఎన్‌కౌంటర్లలో 18 మంది భద్రతా సిబ్బంది, 13 మంది ఉగ్రవాదులు సహా మొత్తం 44 మంది మరణించారు.