జనగామ జిల్లాలో ఘోరం.. పెళ్లి కావట్లేదని మనస్థాపంతో మహిళ కానిస్టేబుల్ సూసైడ్

by Ramesh Goud |
జనగామ జిల్లాలో ఘోరం.. పెళ్లి కావట్లేదని మనస్థాపంతో మహిళ కానిస్టేబుల్ సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్: జనగామ జిల్లా (Janagoan District)లో ఘోరం జరిగింది. పెళ్లి కావట్లేదని మనస్థాపంతో ఓ మహిళ ఏఆర్ కానిస్టేబుల్ (AR Women Constable) ఆత్మహత్య (Suicide)కు పాల్పడింది. ఆ యువతి వరంగల్ కమిషనరేట్ (Warangal Commissionerate) లో విధులు నిర్వహిస్తున్న ఆమె.. ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. కొడకండ్ల మండలం (Kodakandla Mandal) నీలిబండ తండా (Neelibanda Thanda)కు చెందిన నీలిమ 2020 బ్యాచ్ ఏఆర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యింది. ట్రైనింగ్ అనంతరం వరంగల్ కమిషనరేట్ లో ఉద్యోగ విధులు నిర్వహిస్తుంది. గత కొద్ది కాలం నుంచి నీలిమకు వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా నిశ్చయం అవ్వలేదు. దీంతో కొద్దిగా విరామం తీసుకొని మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయినా కూడా ఆమెను చేసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన నీలిమ మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నీలిబండ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న కొడకండ్ల పోలీసులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.



Next Story

Most Viewed