ట్యాంకర్‌తో పొలానికి నీరు.. అడుగంటిపోయిన భూగర్భ జలం

by Aamani |
ట్యాంకర్‌తో పొలానికి నీరు.. అడుగంటిపోయిన భూగర్భ జలం
X

దిశ, యాచారం : చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతు పడరాని పాట్లు పడుతున్నారు. శక్తికి మించి ఖర్చు పెడుతూ ఆర్థికంగా చితికి పోతున్నాడు. మండల పరిధిలోని చింతపట్ల, గ్రామానికి చెందిన ఇటికాల వెంకటరెడ్డి, కి 12 ఎకరాలు ఉండగా 6 ఎకరాలలో వరి, పంటను సాగు చేశాడు. ఎండలు బాగా ముదరడంతో 4 బోరు బావులు ఉన్న 3 బోరు బావుల నుంచి చుక్క నీరు రావడం లేదు. పూర్తిగా 3 బోర్లు ఎండిపోవడంతో పొట్ట దశకు వచ్చిన తన వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. తన కష్టం నేలపాలు కావద్దని కండ్ల ముందే పంట చేను ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేక ఒక్కో ట్యాంకర్‌కు రూ.1000 చెల్లిస్తూ ఐదు ట్యాంకర్ల ద్వారా పంటను తడుపుతున్నాడు. రోజుకు రూ 5000 ఖర్చు అవుతుందని వారం రోజులు పొలానికి నీరు పడితే గండం నుంచి గట్టెక్కినట్టు అవుతుందని రైతు అంటున్నాడు. ఆర్థికంగా చితికి పోతున్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Next Story

Most Viewed