నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

by Naveena |
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): రానున్న నాలుగేళ్ళలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని పర్సాయపల్లిలో రూ.2లక్షల ఎస్డీఎఫ్ నిధులతో మంజూరైన కల్వర్టు నిర్మాణ పనులకు, వేల్పుచర్ల గ్రామంలో రూ.20లక్షలతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మంజూరైన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా కోడూరు గ్రామంలో రూ.12లక్షలతో మంజూరైన అంగన్వాడీ కేంద్రానికి, రూ.5లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ,బీసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1500కోట్లను మంజూరు చేయించానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొరపిడత అవిలయ్య,గుడిపల్లి మధుకర్ రెడ్డి,సామ అభిషేక్ రెడ్డి, జెన్నారెడ్డి వివేక్ రెడ్డి, దాసరి సోమయ్య,మహారాజు,ఊట్కూరి రవీందర్, రవీందర్ యాదవ్, అంజయ్య,చెంచల శ్రీనివాస్,కుంట్ల సురేందర్ రెడ్డి, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed