- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లాట్ల సమస్య పై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తా.. ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం..
దిశ, హిమాయత్ నగర్ : గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోపనపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేటాయించిన ప్లాట్ల సమస్య పై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం తెలిపారు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరమని, అందరూ ఐక్యంగా బాగుండాలని సూచించారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్స్ ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అలాగే పెండింగ్ బిల్లులు, డీఏ పెంపు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని, ఒత్తిడి, వేధింపులు లేవని ప్రశాంతంగా జీవించవచ్చునని, సమస్యలు పరిష్కారానికి మార్గం చూపిస్తుందన్నారు.
రాజ్యాంగాన్ని మార్చరాదని ప్రజలు కోరుకుంటున్నారని, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రు రూపొందిచిన రాజ్యంగం బాగుందని, ప్రజలు నమ్ముతున్నారని, వారు దూరదృష్టితో రాజ్యాంగాన్ని రాశారని, ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో జీవించేలా రాజ్యాంగం ఉందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కనకం కొమురెల్లి, ప్రధాన కార్యదర్శి తూము అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు, పెన్షనర్లకు కాంగ్రెన్ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను గత ప్రభుత్వం తమకు దక్కనీయకుండా చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి జె.ప్రకాశరావు, నాయకులు కె. లక్ష్మణరావు, గోట్ల నూర్యకళ, ఎం. స్వర్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.