Paush Purnima 2025: 2025 లో సంక్రాంతి కన్నా కూడా అందరి చూపు జనవరి 13 పైనే ఉంది.. ఆ రోజు ప్రత్యేకత ఏంటి.. ఈ సృష్టిలో ఏం జరగబోతుంది?

by Prasanna |
Paush Purnima 2025: 2025 లో సంక్రాంతి కన్నా కూడా అందరి చూపు జనవరి 13 పైనే ఉంది.. ఆ రోజు ప్రత్యేకత ఏంటి.. ఈ సృష్టిలో ఏం జరగబోతుంది?
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూ క్యాలెండర్‌లో పౌర్ణమిని నెల చివరి రోజుగా పరిగణిస్తారు. అదేవిధంగా, పౌష పూర్ణిమతో ముగిసిన తర్వాత రోజు నుంచి మాఘమాసం మొదలవుతుంది. అయితే, ఈ తిథి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించి, స్నానం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతీ నెల పూర్ణిమ తిథి మంచిదైనప్పటికీ, ఈ ఏడాది పౌష పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే, ఆ రోజున అరుదైన యాదృచ్ఛికం జరగబోతోంది.

పౌష్ పూర్ణిమ ( Paush Purnima 2025 ) బుధవారం 2025 జనవరి 13 న రానుందని చెప్పారు. అయితే, 144 ఏళ్ల తర్వాత ఈ రోజున ఓ అద్భుత యాదృచ్చిక సంఘటనలు జరగబోతున్నాయి. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ 2025 పౌష్ పూర్ణిమ రోజు మొదలవ్వనుంది. ఈ రోజున స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగ నదులలో స్నానం చేయాలి.

పౌర్ణమి రోజున ఈ పనులు చేయండి

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, పూర్ణిమ రోజున స్నానం చేసి, సూర్యునికి నీటిని సమర్పించి, విష్ణువును పూజలతో పూజిస్తే, వారు మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పరిష్కారం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, డబ్బుకు సంబంధించిన సమస్యలను నుంచి బయటపడటానికి పౌష్ పూర్ణిమ రోజు చాలా మంచిది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే, ఈ రోజున శ్రీమహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవిని కూడా పూజించి లక్ష్మీ స్తోత్రం పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story