దేవుడిపై చంద్రబాబు రాజకీయం చేయడం వలనే తొక్కిసలాట.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
దేవుడిపై చంద్రబాబు రాజకీయం చేయడం వలనే తొక్కిసలాట.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా గురువారం రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు. కాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్(Former Chairman of TTD), వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట(Stampede) ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఈ రోజు ఉదయం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేశాడని, ఆయన చేసిన దుర్మార్గపు ప్రచారం పై భగవంతుడు కళ్లు తెరిచాడని, రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకున్నారు కాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని.. భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా బుధవారం రాత్రి జరిగిన ఈ తొక్కిసలాటలో మొత్తం ఆరుగురు మృతి(Six people died) చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రస్తుతం వారికి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 40 మందికి రుయా ఆస్పత్రిలో చికిత్స అందించారు. వారిలో 16 మంది వెంటనే రిశ్జార్జ్ అయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story