బ్యాంకు అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య

by Sridhar Babu |
బ్యాంకు అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య
X

దిశ, ఆసిఫాబాద్ : బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక సిర్పూర్ టీ మండలంలోని శివపూర్ గ్రామానికి చెందిన రైతు కారం సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం సిర్పూర్ లోని ఓ కోపరేటివ్ బ్యాంకులో ఏడేళ్ల క్రితం సంతోష్ 30 వేలు అప్పు తీసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికి ఉన్నంతలో బ్యాంకుకు డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు.

ఇదే క్రమంలో మంగళవారం ఇంటికి వచ్చిన సదరు బ్యాంకు అధికారులు మిగితా అప్ప చెల్లించాలని, లేకుంటే మీ ఇంటికి తాళం వేసి వేలం వేస్తామని బెదిరించడంతో మనస్థాపానికి గురై సంతోష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య తెలిపారు. సంతోష్ ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు, భార్య దిక్కులేనివారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కమలాకర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed