- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG: వేసవిలో విద్యుత్అంతరాయం ఉండొద్దు
దిశ, తెలంగాణ బ్యూరో: వేసవి, యాసంగి పంటకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసే విధంగా అధికారులు యాక్షన్ప్లాన్రూపొందించాలని ఇందనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్సుల్తానీయా ఆదేశించారు. మంగళవారం విద్యుత్సౌదాలో వేసవి కాలంలో విద్యుత్అవసరాలను తీర్చగలడంపై ఉన్నతాధికారులతో ఇందనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్సుల్తానీయా సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి 33కేవీ, 11కేవీ సబ్స్టేషన్లలో విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఒక వేళ ఫీడర్బ్రేక్డౌన్లు సంబవిస్తే వెంటనే సెంట్రలైజ్డ్బ్రేక్డౌన్సిబ్బందిని అక్కడికి పంపించి సమస్యను విలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చూడాలన్నారు.
నిర్మాణంలో ఉన్న 400కేవీ, 220కేవీ, 132 కేవీ సబ్ స్టేషన్ ల త్వరగా పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఎక్స్‌ట్రా హెవోల్టేజీ లైన్స్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్‌తో పాటుగా మరో రెండు స్టోరీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా మేటిరియల్త్వరగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణా భాస్కర్, ఎస్పీడీసీఎల్సీఎండీ ముషారఫ్‌అలీ, ఎన్ పీడీసీఎల్సీఎండీ వరుణ్‌రెడ్డి, ట్రాన్స్జెఎండీ శ్రీనివాస్‌రావు, తదితరలు పాల్గొన్నారు.