యాదగిరిగుట్ట ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్

by Naveena |
యాదగిరిగుట్ట ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట ఇన్చార్జి రిజిస్టర్ గోపిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఆర్ రవి వెల్లడించారు. ‌బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలేరు మండలం కొలనుపాక లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని సంబంధిత శాఖ కమిషనర్ కు వంటల జంగయ్య,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయన చేసిన డాక్యుమెంట్లపై విచారణ చేశారు. ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ పరిధిలోని 473/E3, 472E3/1/2 సర్వే నంబర్లలోని అనాధికార వెంచర్లో నిబంధనలకు విరుద్దంగా 154 ప్లాట్లను రిజిష్ట్రేషన్ చేసినట్లు రుజువైంది. ఈ విచారణలో గోపి నాయక్ చేసిన డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధమని నిర్ధారణ తెలడంతో సస్పెండ్ చేశామని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవి వెల్లడించారు.యాదగిరిగుట్ట ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్

Advertisement

Next Story

Most Viewed