గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

by Sridhar Babu |
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ , హుజురాబాద్ రూరల్ : కాకతీయ ప్రధాన కాలువలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సీఐ తిరుమల్ గౌడ్ కథనం ప్రకారంపెద్ద పాపాయ్యపల్లి, కందుగుల గ్రామాల మధ్య కాకతీయ కాలువలో ఫోర్ లైన్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చి పనుల వద్ద నిలిచింది.

గుర్తించిన కూలీలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. మహిళ నీలిరంగు చీర, జాకెట్​ ధరించి ఉందని, వయస్సు దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని, ముక్కుపుడక ఉందని తెలిపారు. మహిళను గుర్తుపట్టిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed