- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దిపేట బీఆర్ఎస్ శ్రేణుల్లో... పొంగులేటి గుబులు..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట బీఆర్ఎస్ శ్రేణుల్లో పొంగులేటి గుబులు మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిరి సిద్దిపేట జిల్లాలోనూ భూ అక్రమాలు జరిగాయని, దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంతో భూ ఆక్రమణ దారులు హడలి పోతున్నారు. దర్యాప్తులో ఎవరే వరి భూ బాగోతం బట్టబయలు అవుతుందో..? పరిస్థితి ఏంటీ..? అని ఆక్రమణలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు, నాడు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన అధికారులు సైతం వనికి పోతున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలే టార్గెట్ గా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ ఆక్రమణల పై అధికారులు కొరడ ఝుళిపిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు దూకుడు ప్రదర్శిస్తుండటంతో భూ ఆక్రమణ దారులు సంబంధిత పత్రాలను అధికారులకు అందజేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిరి సిద్దిపేట జిల్లాలోనూ భూ అక్రమాలు జరిగాయని దర్యాప్తునకు ఆదేశించినట్లు ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంతో జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది.
పీవోటీ, జీవో 59 కి తూట్లు..?
జిల్లాలో పీవోటీ చట్టానికి, జీవో 59 కి తూట్లు పొడుస్తూ అధికారం అడ్డు పట్టుకొని బీఆర్ఎస్ కీలక నేతలు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు పాల్పడరాని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో గులాబీ నేతల అక్రమాల పుట్ట బట్టబయలు అయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.
ఆక్రమణ దారులు హడల్..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణల పై ప్రభుత్వ దృష్టి సారించడంతో ఆక్రమణ దారులు హడలెత్తి పోతున్నారు. అధికారం అడ్డు పెట్టుకొని ప్రభుత్వ , అసైన్డ్ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకున్న నాయకులు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఇదిలా ఉంటే నాడు నాయకులకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ బీఆర్ఎస్ కీలక నాయకులు, వారి అనుచరులే టార్గెట్ గా అధికార పార్టీ ఎత్తుగడ ఏ మలుపు తీసుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.