- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో తల్లీ, కూతురు మృతి..
దిశ, బడంగ్ పేట్ : లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌కు తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలైన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పహాడీషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ యెల్లికల్ మండలానికి చెందిన తిమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన చిట్టారి గోపాల్ (34), చిట్టారి లక్ష్మమ్మ (32) లు దంపతులు. వీరికి చిట్టారి విజయ (14) సంతానం. కుమార్తె విజయకు ఎర్ర రక్త కణాల చికిత్స కోసం ఈ నెల 8వ తేదీన ఉదయం టీఎస్ 31 ఈ 7437 నెంబర్ గల హోండా షైన్ బైక్‌పై గోపాల్, లక్ష్మమ్మ, విజయలు బయలుదేరారు.
మార్గ మధ్యలో తుక్కగూడ అవుటర్ రింగ్ రోడ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ డ్రైవర్ ఒక్క సారిగా శంషాబాద్ వైపు ఎడమ వైపునకు తిప్పడంతో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి లక్ష్మమ్మ, కూతురు విజయలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతిచెందారు. భర్త చిట్టారి గోపాల్‌కు కాలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లీ కూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలపాలైన గోపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.