- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ప్రధాని మెచ్చిన మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
దిశ, సినిమా: హీరో విక్రాంత్ మాస్సే(Vikrant Massey) గత ఏడాది ‘12th ఫెయిల్’(12th Fail) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎంతో మంది సినీ సెలబ్రిటీల మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రాణించింది. అలాగే ఓటీటీలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇటీవల విక్రాంత్ ‘సబర్మతి రిపోర్ట్’ (Sabarmati Report)మూవీలో నటించి మెప్పించాడు. గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా వచ్చిన ఈ చిత్రం నవంబర్ 15న థియేటర్స్‌లోకి వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమాకు ధీరజ్ సర్నా(Dheeraj Sarna) దర్శకత్వం వహించగా.. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. ‘సబర్మతి రిపోర్ట్’ పై ఇటీవల ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. దీనిని చూడాలనే ఆసక్తి పెరిగింది. ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘సబర్మతి రిపోర్ట్’ డిజిటల్ స్ట్రీమింగ్(Digital streaming)కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ మూవీ జనవరి 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు.
Read More ...