- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Demat Accounts: 2024లో 18.5 కోట్లకు పెరిగిన డీమ్యాట్ ఖాతాలు
దిశ, బిజినెస్ బ్యూరో: 2024లో కొత్తగా 4.60 కోట్ల డీమ్యాట్ ఖాతాలు పెరిగాయి. దీంతో గతేడాది సగటున నెలకు 38 లక్షల అకౌంట్లు పెరిగాయి. దీంతో కొత్త డీమ్యాక్ అకౌంట్ల వృద్ధి ఏడాది ప్రాతిపదికన 33 శాతం పెరగడంతో కొత్త ఖాతాల సంఖ్య 18.5 కోట్లకు చేరుకుంది. దేశంలో క్రమంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం, అందుబాటులో డేటా ఉండటం వల్ల కొవిడ్-19 మహమ్మారి తర్వాతి నుంచి డీమ్యాట్ అకౌంట్లు పెరిగాయి. గడిచిన ఐదేళ్లలో అంటే 2019లో 3.93 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. స్టాక్ మార్కెట్లలో లాభాలు, రికార్డు స్థాయిలో ఐపీఓలు రావడంతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో మన మార్కెట్ల నుంచి విదేశీ aపోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అమ్మకాలు, త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు బలహీన ఆదాయాలను వెల్లడించడం వంటి కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో కొంత నెమ్మదించాయి. అనంతరం డిసెంబర్‌లో ఐపీఓలు పెరగడంతో మళ్లీ డీమ్యాట్ ఖాతాలు పుంజుకున్నాయి. గత నెలలో 15 కంపెనీలు ఐపీఓల నుంచి రూ. 25 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. మొత్తంగా 2024లో 91 కంపెనీలు రూ. 1.60 లక్షల కోట్లను సేకరించాయి.