- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YSRCP: చంద్రబాబు ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష..? మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు.. ఆరోగ్య శ్రీ పై(Arogya Sri) మీకు ఎందుకింత కక్ష? అని, పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి(YSRCP Leader YS Jaganmohan Reddy) ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు విధానంపై స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం(NDA Govt)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని, ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారని, కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు అని నిలదీశారు. అలాగే అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్య శ్రీని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా అని, మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు.
ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టుపెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదని, ప్రజల ఆస్తిగా వైయస్సార్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలను స్కాం చేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే, ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా అని నిలదీశారు. ఇక ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా అని, మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా అని అడిగారు. లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం అని, కోవిడ్ వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుందని తెలిపారు.
ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుందని, మరి ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా.. మీరు చేయించగలరా అని, విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా అని, ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు(CM Chandrababu) నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. కాని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.. ఏరోజైనా ఆ ప్రయత్నంచేశారా అని, పోనీ దివంగత మహానేత వైయస్సార్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతంచేసేలా ఒక్కపనైనా చేశారా? అని అడిగారు.
ఆరోగ్య శ్రీతో మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారని, కొత్తగా అంబులెన్స్‌లు తీసుకు వచ్చి 104,108 సేవలను మేం మెరుగుపరిస్తే, మీరు నెలల తరబడి బకాయిలుపెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారని, తీరా అధికారంలోకి వచ్చాక మీర్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఇచ్చిన హామీలను ఎలాగూ ఎగరగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దు చేస్తున్నారని, ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారని అన్నారు. ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని, వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.