- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tamilanadu: కచ్చతీవు స్వాధీనానికి తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

దిశ, నేషనల్ బ్యూరో: కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుంచి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రతిపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలోనే ఎక్కువగా దాడులకు దిగుతుండటం, లక్షలాది రూపాయల విలువైన పడవలను ధ్వంసం చేయడం, మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి చర్యలకు శ్రీలంక దళాలు దిగుతున్నాయి. శ్రీలంక నావికాదళం చేస్తున్న అరెస్టులు, పడవల జప్తు వల్ల తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రతిపక్షాలను ఉద్దేశించి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామిపై విమర్శలు చేశారు. గతంలో వారు అధికారంలో ఉన్న సమయంలో కచ్చతీవు అంశాన్ని లేవనెత్తలేదని విమర్శించారు. మేము తీసుకొచ్చిన ఈ తీర్మానం గురించి మాట్లాడవచ్చు, ఈ సమయంలో కూడా పాత రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. శ్రీలంకతో జరిగిన ఒప్పందాన్ని సవరించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరిన ఆయన, శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నేతలతో చర్చించాలని కోరారు. కచ్చతీవును సొంతం చేసుకోవాలని, మన మత్స్యకారులను విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సభ కేంద్రప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరుతోందని స్టాలిన్ ప్రకటించారు. మత్స్యకారులపై దాడులు జరగవని 2014లోనే ప్రధాని మోడీ హామీ ఇచ్చినప్పటికీ, అరెస్టులు, మత్స్యకారుల పడవలను స్వాధీనం చేసుకోవడం కొనసాగాయని అన్నారు. తమిళనాడు మత్స్యకారులు కూడా భారతీయ మత్స్యకారులే అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరచిపోయినట్లుందని ఎద్దెవా చేశారు. 2024లో ఏకంగా 500 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేశారు. అంటే రోజుకు ఇద్దరు. 97 మంది మత్స్యకారులు ఇంకా శ్రీలంక జైళ్లలో ఉన్నారని విదేశాంగ మంత్రి స్వయంగా మార్చి నాటి ప్రకటనలో అంగీకరించారు. ఇవన్నీ ఆపాలని తీర్మానంలో పేర్కొన్నారు.