- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీమ్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ.. టెస్టుల్లో ర్యాంక్ డౌన్
దిశ,స్పోర్ట్స్ : టీమ్ ఇండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన బాధలో ఉన్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా 109 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నది. పాకిస్తాన్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయడంతో రోహిత్ సేన ర్యాంక్ పతనమైంది. అంతకుముందు 2వ స్థానంలో ఉండేది. అయితే, పాక్‌తో రెండో టెస్టులో విజయంతో దక్షిణాఫ్రికా 112 రేటింగ్ పాయింట్లతో భారత్‌ను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరుకుంది. 2016 తర్వాత టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోవడం ఇదే తొలిసారి. ఇటీవల టెస్టుల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. గత 8 టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒకటి డ్రా చేసుకుంది. న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్, ఆస్ట్రేలియాతో 3-1తో సిరీస్ కోల్పోవడంతో భారత్ వరుసగా మూడో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియా(126) అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా, భారత్ తర్వాత ఇంగ్లాండ్(106), న్యూజిలాండ్(96) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక(7), పాకిస్తాన్(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్(65), ఐర్లాండ్(26) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.