- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Health : హైకొలెస్ట్రాల్ సమస్య.. ఈ నూనెలు వాడితే నో రిస్క్!
దిశ, ఫీచర్స్ : ఏజ్‌తో సంబంధం లేకుండా హైకొలెస్ట్రాల్, హైబీపీ, హార్ట్ ఎటాక్ వంటి ప్రాబ్లమ్స్ ఇటీవల పెరుగుతున్నాయి. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. పైగా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు, సిరలు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ మనం రోజూ వంట చేయడానికి వాడే కొన్ని నూనెలు కూడా కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధిక కొవ్వులు కలిగిన రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసేవి వాడితే బెటర్ అంటున్నారు నిపుణులు. అలాంటి ఆయిల్స్ ఏవో చూద్దాం.
*ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్లో ఆరోగ్య కరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే జుట్టు, చర్మం సంరక్షణకు ఇది సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బాడీలోని ప్రతీ అవయవానికి మేలు చేస్తాయని, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
*వేరు శెనగ నూనె : వేరు శనగలో యాంటీ సెప్టిక్, ఆస్ట్రిజెంట్, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. అయితే శీతాకాలంలో చాలానూనెలు గడ్డ కడుతుంటాయి. కానీ వేరు శెనిగ నూనె కట్టదని చెప్తారు. ఈ సీజన్ లో వాడటంవల్ల శరీరాన్ని వెచ్చగా ఉండచడంలోనూ సహాయపడుతుంది.
* నువ్వుల నూనె : నువ్వుల నూనె గుండె జబ్బులు ఉన్నవారికి మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని అసంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. ఇవి మొత్తం గుండె ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
* అవకాడో నూనె : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అవకాడో ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లుటిన్ వంటి ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి కూడా అవకాడో చాలా మంచిది. ఫైబర్ అధికంగా ఉండటంవల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి అవకాడో ఆయిల్ సహాయపడుతుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.