- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Darshans: ఈ రోజే ఇలా ఉందంటే.. రేపటి నుంచి పరిస్థితేంటో..?
దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల(Srivari Vaikuntha Dwara Darshans)కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 19 వరకు భక్తుల(Devotees)కు ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించనున్నారు. దీంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అధికారులు(TTD Officers) అంచనా వేశారు. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శనాలకు గురువారం ఉదయం నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు.
ఈ మేరకు తిరుపతి(Tirupati)లో అన్ని ఏర్పాట్లు చేశారు. 9 కేంద్రాల్లో టోకెన్లు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలీసు, విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టారు. అటు సాంకేతికంగా సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ టోకెన్ల కేంద్రాల వద్ద అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఈ కేంద్రాల వద్దకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చారు.