Iran: ఇరాన్‌లో గతేడాది 900 మందికి ఉరిశిక్ష.. వెల్లడించిన యూఎన్ఓ

by vinod kumar |
Iran: ఇరాన్‌లో గతేడాది 900 మందికి ఉరిశిక్ష.. వెల్లడించిన యూఎన్ఓ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌(Iran)లో గతేడాది 901మందికి ఉరిశిక్ష విధించినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వీరిలో 31 మంది మహిళలు సైతం ఉన్నారు. మరణశిక్షలు విధించిన కేసుల్లో ఎక్కువగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలే ఉన్నట్టు తెలిపింది. అయితే మహిళలకు చెందిన నేరాల్లో మాత్రం బలవంతంగా వివాహం చేసుకున్న తర్వాత వారి భర్తలను హత్య చేసినందుకు దోషులుగా తేలారని పేర్కొంది. ఇరాన్‌లో ప్రతిఏటా మరణశిక్షకు గురయ్యే వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోందని యూఎన్ఓ మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ తెలిపారు. ఇరాన్‌లో 2023లో 853 మందికి ఉరిశిక్ష విధించగా 2024 నాటికి ఆ సంఖ్య 901కి చేరుకుంది. 2015లో 970 మందికి ఉరిశిక్ష విధించగా తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఉరిశిక్షలను వెంటనే నిలిపివేయాలని ఇరాన్‌కు వోల్కర్ విజ్ఞప్తి చేశారు. దీనిని ఆపాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మరణశిక్ష జీవించే ప్రాథమిక హక్కుకు విరుద్ధమని, దీనిని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed