కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా... వ్యక్తి మృతి

by Sridhar Babu |
కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా... వ్యక్తి మృతి
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని మంగపేట గ్రామంలో ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట పట్టణానికి చెందిన పద్మశాలి స్వీట్ హౌస్ యజమాని చొక్కారపు శ్రీనివాస్ ఆటో లో జమ్మికుంట నుండి గోదావరిఖని వైపు వెళ్తున్న క్రమంలో మంగపేట గ్రామ సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

దాంతో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కాగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని ఎస్సై వెంకటేష్ తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఆటోలో ప్రయాణిస్తున్న మోత్కుల గూడెం గ్రామానికి చెందిన ముక్కిరి రాయమల్లు, అతని భార్యకి బలమైన గాయాలు అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed