- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాదాపూర్ లోని కృష్ణ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం..
దిశ, శేరిలింగంపల్లి : నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం మాదాపూర్ లో ఓ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ అండ్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రెస్టారెంట్ లో ఉన్న కస్టమర్లు, హోటల్ సిబ్బంది, బయటకు పరుగులు తీశారు.
హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్ లో మంటలు చెలరేగినట్లు మాదాపూర్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అబ్దుల్ ఫజల్ తెలిపారు. రెస్టారెంటులో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం పట్ల కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కిచెన్ తో పాటు రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది.