Neem water benefits: వేపాకు కలిపిన వాటర్‌తో స్నానం.. ప్రయోజనాలా? నష్టాలా?

by Anjali |
Neem water benefits: వేపాకు కలిపిన వాటర్‌తో స్నానం.. ప్రయోజనాలా? నష్టాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: వేపాకు(neem)ల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆ ఆకుల్ని ఆయుర్వేదం(Ayurveda)లో ఉపయోగిస్తుండటం విశేషం. వేపాకులతో కాచిన వాటర్ తో బాలింతలు అండ్ చిన్న పిల్లలకు పెద్దలు స్నానం చేయిస్తుంటారు. అయితే వేపాకు స్నానం మంచిదేనా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి.

కాగా తాజాగా దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. వేపాకు వేసిన వాటర్‌తో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయి. అలాగే దరిచేరకుండా ఉంటాయి తప్ప నష్టాలేమి లేవని నిపుణులు వెల్లడిస్తున్నారు. కేవలం చిన్న పిల్లలు, బాలింతలు మాత్రమే కాదు.. ప్రతీ ఒక్కరు ఈ వాటర్ తో స్నానం చేయవచ్చని చెబుతున్నారు.

వేపాకుతో కాచిన వాటర్ తో స్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. ఫేస్ పై పింపుల్స్(Pimples) కూడా రావు. చర్మ సమస్యలే(Skin problems)వైనా ఉన్నట్లైతే తగ్గిపోతాయి. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. స్కిన్ లోని సహజ నూనె సమతుల్యత(Natural oil balance)ను రక్షిస్తుంది. శరీర దుర్వాసను(body odor) దూరం చేస్తుంది. బ్యాక్టీరియాను వదిలిపెడుతుంది. కంటి అలెర్జీ(Eye allergy)ల నుంచి ఉపశమనం కలుగుతుంది. కళ్లకు, చర్మానికి చికాకు కలిగిస్తుంది. చుండ్రు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed