అంబులెన్స్ సేవలు లేక నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారు : ఎమ్మెల్యే రోహిత్ రావు

by Aamani |
అంబులెన్స్ సేవలు లేక నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారు :  ఎమ్మెల్యే రోహిత్ రావు
X

దిశ, నిజాంపేట: మండల కేంద్రం ఏర్పడినప్పటి నుంచి ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు లేక నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం నూతన అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసుకుందమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తుందని ఆయన కొనియాడారు.

అనంతరం మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నర్సింహులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాత రావు, అమర్ సేన రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, ఎంఎస్ఎస్ఓ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, గుమ్ముల అజయ్, లింగం గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story