- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Achchennaidu: వైసీపీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసింది.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం (YCP Government) గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. వ్యవసాయం (Agriculture)లో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని అన్నారు. డ్రోన్ టెక్నాలజీ (Drone Technology)తో కూడా వాడుకుంటామని పేర్కొన్నారు. పంటల సాగు కోసం భూసార పరీక్షలకు కూడా అత్యాధునిక టెక్నాలజీ వచ్చిందని అన్నారు. సేంద్రియ వ్యవసాయం (Organic Farming)తో మంచి దిగుబడి, ఫలితాలు ఉంటాయని తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీతో రైతులకు నిత్యం ఉపయోగపడే పనిముట్లను అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.