- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం.. 8 మంది జవాన్లు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్(Bijapur)లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాలబలగాలు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీ పెట్టి(IED blast) పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. 8 మంది డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG) జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా సోమవారం ఉదయం కుత్రు అటవీ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తుండగా.. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఐఈడీ పెట్టి పేల్చివేశారు. బీజాపూర్ జిల్లాలోని బెద్రే-కుత్రు రోడ్డులో పేలుడు జరిగినట్లు సమాచారం.
ఎదురుకాల్పులు
ఇకపోతే, ఆదివారం నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దక్షిణ అబుజ్‌మాద్‌లోని అటవీప్రాంతంలో శనివారం రాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఆ కాల్పుల్లో ఐదుగురు మావోలు చనిపోయారు. ఎదురుకాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ కూడా మరణించాడు. కాగా.. శుక్రవారం ప్రారంభించిన ఆ ఆపరేషన్‌లో నారాయణపూర్, బస్తర్, కొండగావ్, దంతేవాడకు చెందిన డీఆర్జీ సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ఇకపోతే, జనవరి 3న రాయ్‌పూర్ డివిజన్‌లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మరణించాడు. అంతేకాకుండా గతేడాది జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.