జిల్లా ఆస్పత్రిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన విప్ ఐలయ్య..

by Sumithra |
జిల్లా ఆస్పత్రిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన విప్ ఐలయ్య..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు ప్రాంతాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పరిశ్రమలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు. ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చనిపోయిన కనకయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అదే భువనగిరిలో కస్తూరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed