TPCC: లొట్టపీసు కేసు అని ఉలిక్కిపడుతున్నావెందుకు కేటీఆర్..? సామా రామ్మోహన్

by Ramesh Goud |   ( Updated:2025-01-06 11:05:00.0  )
TPCC: లొట్టపీసు కేసు అని ఉలిక్కిపడుతున్నావెందుకు కేటీఆర్..? సామా రామ్మోహన్
X

దిశ, వెబ్ డెస్క్: లొట్టపీసు కేసు అన్న టిల్లు ఉలిక్కిపడుతున్నాడు ఎందుకని, భారం ప్రభుత్వానికి.. బాండ్లు బీఆర్ఎస్(BRS) కా..? అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్(TPCC Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) అన్నారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. భారం ప్రభుత్వానికి.. బాండ్లు బీఆర్ఎస్ కు.. వెలుగులోకి వస్తున్న కేటీఆర్ ఫార్ములా-ఈ కుంభకోణం అని రాసుకొచ్చారు.

అలాగే ఉట్టి కేసు.. లొట్టపీసు కేసు అన్న టిల్లు నేడు ప్రశ్నలకు ఉలిక్కిపడుతున్నాడెందుకు అని, మీడియా సూటి ప్రశ్నలకు సొల్లు జవాబులెందుకు ఇస్తున్నట్టూ? అని ప్రశ్నించారు. అంతేగాక తెలంగాణ సర్కార్, ఎఫ్ఈఓ లండన్, గ్రీన్ కో మధ్య త్రై పాక్షిక ఒప్పందం 2022లో జరిగిందని, బీఆర్ఎస్, గ్రీన్ కో మరియు అనుబంధ సంస్థల నుండి 49 కోట్ల రూపాయలు వచ్చింది కూడా 2022 లోనే కదా అని నిలదీశారు. మీరు ఏ అబద్దాలు చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని అనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది లొట్టపీసు కేసా.. సైకో రామ్ ని లొపలేసే కేసా ముందు ముందు చూస్తామని సామా అన్నారు.

Advertisement

Next Story