Megastar:‘ప్రతిభ ఉంటే సరిపోదు.. ప్రవర్తన కూడా బాగుండాలి’.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Megastar:‘ప్రతిభ ఉంటే సరిపోదు.. ప్రవర్తన కూడా బాగుండాలి’.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో హైటెక్స్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన అమెరికాన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) ‘క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025’ కార్యక్రమానికి టాలీవుడ్(Tollywood) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని.. వాటిని చూసి వెనుకడుగు వేయొద్దు అని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. ఈ నేపథ్యంలో కష్టాన్ని నమ్ముకుని లక్ష్యం వైపు సాగాలని పేర్కొన్నారు. సమాజంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చెప్పారు.

అంతేకాదు.. ‘‘ప్రతిభ ఉంటే సరిపోదు.. ప్రవర్తన కూడా బాగుంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చు’’ అని చిరంజీవి వెల్లడించారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రమశిక్షణ ముఖ్యమని చెప్పారు. ఈ తరుణంలో విద్యార్థులు(Students) మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచిని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ‘‘కాలేజీ రోజుల్లో(College Days) నేను ప్రదర్శించిన నాటకానికి అవార్డు వచ్చిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అందరు నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీలయ్యే వాణ్ని.. ఆ నటనే కెరీర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచన అప్పుడే పుట్టిందని చెప్పారు. నేరుగా అవకాశాలు రావని తెలుసుకున్న అందుకే నటనలో మంచి శిక్షణ తీసుకొని ముందుకు వెళ్లిపోయా. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్న’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story