- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు రోజుల్లో రూ.116 కోట్ల మద్యం సేల్..ఎక్కండంటే..?
దిశ,రంగారెడ్డి బ్యూరో: 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన మద్యం అమ్మకాల్లో రూ.116 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 93,725 లిక్కర్.. 1,18,447 బీర్ కేసులు విక్రయించారు. కానీ గత ఏడాది ఈ మూడు రోజుల్లో రూ.117.32 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. 98,266 లిక్కర్.. 1,03,538 బీర్ల కేసులు సెల్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2023 డిసెంబర్ 29, 30,31 తేదీల్లో 2024 డిసెంబర్ 29,30,31 తేదీల్లో విక్రయించిన మద్యం సెల్ తో పోలిస్తే రూ.1 కోటి 12 లక్షల ఆదాయం నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
శంషాబాద్ సర్కిల్లోనే అత్యధిక ఆదాయం...
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మూడు ఎక్సైజ్ సర్కిల్. అవీ సరూర్‌నగర్, శంషాబాద్ వికారాబాద్ సర్కిళ్లు కాగా వీటి పరిధిలో 14 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. శంషాబాద్ సర్కిల్లో మూడు పోలీస్ స్టేషన్ నుంచి శంషాబాద్, శేరిలింగంపల్లిలో పూర్తిగా అర్బన్, చేవెళ్ల రూరల్ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే అర్బన్ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల్లో విక్రయాలు జోరుగా జరిగినట్లు తెలుస్తోంది. శంషాబాద్ సర్కిల్ పరిధిలో 41,414 లిక్కర్, 53337 బీర్ కేసులు విక్రయిస్తే రూ.56.77కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. కానీ ఒక్క శేరిలింగంపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోనే 18,766 లిక్కర్.. 25,503 బీర్ కేసులు విక్రయిస్తే రూ.28.69కోట్లు వచ్చింది. ఈ స్టేషన్ పరిధిలో లిక్కర్ కంటే బీర్ కేసులు అత్యధికంగా విక్రయించినట్లు తెలుస్తోంది. సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లుండగా సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్, షాద్‌నగర్ పరిధిలోనున్నాయి.
అయితే ఈ సర్కిల్ పరిధిలో సరూర్‌నగర్ తప్ప మిగిలిన ఐదు పోలిస్ స్టేషన్లు రూరల్ ప్రాంతంలోనే ఉన్నాయి. 42,563 లిక్కర్.. 49,966 బీర్ కేసులు విక్రయిస్తే రూ.49.58కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా వికారాబాద్ సర్కిల్ పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూర్, మోమిన్‌పేట్, కొడంగల్ ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ సర్కిల్ పరిధిలో 9748 లిక్కర్.. 15144 బీర్ కేసులు విక్రయిస్తే కేవలం రూ.9.75కోట్ల ఆదాయం తో సర్దుకున్నారు. కానీ అదే సీఎం నియోజకవర్గమైన కొడంగల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1026 లిక్కర్.. 2255 బీర్ కేసులు విక్రయిస్తే రూ.1.13కోట్లు ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే లిక్కర్ 4శాతం సేల్ తగ్గింది. కానీ 28శాతం బీర్ విక్రయం పెరిగింది.
తగ్గిన ఎక్సైజ్ ఆదాయం...
రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఆశించిన స్థాయిలో డిసెంబర్ 29,30,31 తేదీల్లో ఆదాయం రాలేదనే చర్చ సాగుతుంది. సాధారణంగా రోజూ వారీగా వచ్చే ఆదాయంలాగే నూతన సంవత్సర వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెద్దగా మద్యం సేల్ లేదని లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు నగరానికి అతి దగ్గరలో ఉన్నందుకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులు గెట్ టుగెదర్ పార్టీలు పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది వేడుకలు భారీగా జరిగినట్లు కనిపించిన మద్యం సేల్ పెద్దగా లేదని తెలుస్తోంది. అంతేకాకుండా దసరా పండుగ సందర్భంగా జరిగిన సెల్‌ను కూడా దాటలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.