- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: నన్ను అరెస్ట్ చేయాలని సర్కార్ కుట్రలు పన్నుతోంది.. కేటీఆర్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తనను ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. వారి సూచనల మేరకు ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతానని క్లారిటీ ఇచ్చారు. తనపై ఏసీబీ (ACB), ఈడీ (ED)లు పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని కొట్టిపడేశారు. తనను ఎలాగైన అరెస్ట్ చేయాలని రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అరెస్టులు, కేసులకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నేతలు భయపడరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సీఎం రేసులో కేటీఆర్ (KTR), కవిత (Kavitha) ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే (KCR) అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి తగిన గుణపాఠం చెబుతామని.. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ అన్నారు.