- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేపల వలలో చిక్కిన భారీ కొండచిలువ
దిశ, కొత్తకోట: చేపల వలలో ఎనిమిది అడుగుల 11 కేజీల బరువు భారీ కొండచిలువ సోమవారం చిక్కింది. వివరాలకు వెళితే..కొత్తకోట మండలం కానాయాపల్లి గ్రామ శివారులో ఉన్న పంప్ హౌస్ పక్కన ఉన్న కెనాల్ లో గుర్తుతెలియని వ్యక్తులు చేపల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కిందని తెలిపారు. పంప్ హౌస్ లో ఉన్న సిబ్బంది గమనించి స్నేక్ సొసైటీ వ్యవస్థాపనకులు చీర్ల కృష్ణ సాగర్ కు సమాచారం ఇవ్వగా..సంఘటన స్థలానికి చేరుకొని వలలో చిక్కిన కొండచిలువను సురక్షితంగా బయటికి తీసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణ సాగర్ మాట్లాడుతూ..గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులు, అడవి జంతువుల కొరకు వలలు, కరెంట్ తీగలు పెట్టడం వలన ,ఎన్నో రకాలైన అడవి జంతువులతో పాటు, మనుషులు కూడా కరెంట్ షాకు తగిలి చనిపోతున్నారని తెలిపారు. కాబట్టి రైతులు సాంకేతికతను ఉపయోగించుకొని రసాయన మందులు పిచికారి చేయాలని కృష్ణ సాగర్ అన్నారు. అనంతరం బంధించిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, హుదూత్ , తదితరులు పాల్గొన్నారు.