Allu Arjun: మాకు చెప్పకుండా అక్కడికి వెళ్లొద్దు.. అల్లుఅర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు

by Prasad Jukanti |
Allu Arjun: మాకు చెప్పకుండా అక్కడికి వెళ్లొద్దు.. అల్లుఅర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కు రాంగోపాల్ పేట పోలీసులు (Ramgopal Peta Police) మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Incident) ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sritej) ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు వచ్చినా తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాలన్నారు. ఒకవేళ తమకు సమాచారం ఇవ్వకుడా ఆసుపత్రికి వస్తే పూర్తి బాధ్యత మీదేనంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా శ్రీతేజ్ ను పరామార్శించేందుకు నిన్న ఆసుపత్రికి అల్లుఅర్జున్న వెళ్తున్నారన్న సమాచారంతో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులు, ఇతరులకు అంతరాయం కలగకుండా ఉండాలని ఆసుపత్రి సిబ్బందితో సమన్వయం చేసుకుని భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ సందర్శన వల్ల ప్రజల భద్రత, ఆసుపత్రి కార్యకలాపాలకు ఆటంకం కలిగితే దానికి పూర్తి బాధ్యత అల్లుఅర్జున్ వహించాలంటూ నిన్నటి నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లలేదు. తాజాగా ఇవాళ మరోసారి నోటీసులు ఇస్తు తమకు ముందస్తు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story